మయూరుని సూర్యశతకము, అర్థము-౪. ౩౧.మీలచ్చక్షుర్విజిహ్మశ్రుతి జడరసవం నిఘ్నితఘ్రాణవృత్తి
సూతా! యే యుగవేళ నేమిటికి నెచ్చోటన్ మునిశ్రేష్ఠు నే
శ్రోతల్ గోరిరి యేమిహేతువునకై శోధించి లోకైక వి
ఖ్యాతిన్ వ్యాసుఁడు మున్ను భాగవతముం గల్పించెఁ దత్పుత్రుఁడే
ప్రీతిన్ రాజున కీ పురాణకథఁ జెప్పెన్ జెప్పవే యంతయున్.
తరల.
శుకుఁడు గోఁచియులేక పైఁజనఁ జూచి తోయములందు ల
జ్జకుఁ జలింపక చీరలొల్లక చల్లులాడెడి దేవక
న్యలు "హా శుక" యంచు వెన్కఁ జనంగ వ్యాసునిఁ జూచి యం
శుకములన్ ధరియించి సిగ్గున స్రుక్కిరందఱు ధీనిధీ!
ʅ(◔౪◔)ʃ
పాండవ వంశంబు బలము మానంబును వర్ధిల్లఁ గడిమి నెవ్వాఁడు మనియెఁ
బరిపంథిరాజులు భర్మాదిధనముల నర్చింతు రెవ్వని యంఘ్రియుగముఁ
గుంభజకర్ణాది కురుభటవ్యూహంబు సొచ్చి చెండాడె నే శూరుతండ్రి
గాంగేయసైనికాక్రాంత గోవర్గంబు విడిపించి తెచ్చె నే వీరుతాత